పాపం చేసిన వాళ్లు చివరి ఊపిరిలో పరమాత్మను స్మరిస్తే పరమాత్మను చేరుకుంటాడా?

పాపాలు చేసిన వాళ్ళు దేహాన్ని విడిచినప్పుడు భగవంతునిస్మరిస్తే మోక్షం కలుగుతుందా? ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

లోతుగా ఆలోచించే వాళ్లను కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ కోవకు చెందినదే ఈ ప్రశ్న. అది ఏమిటంటే బ్రతికుండగా పుణ్య కర్మలు చేయకుండా భగవంతుని యందు భక్తి లేకుండా అందరిని బాధపడుతూ అక్రమంగా ధనం సంపాదించి ఇతరులను మోసం
చేస్తూ లబ్ధి పొందుతూ అందరినీ బాధపెడుతూ హింసిస్తూ అంత్య కాలము నందు అనగా దేహాన్ని విడిచినప్పుడు చివరి ఊపిరి లో భగవంతుని స్మరించినట్లయితే భగవంతున్ని పొందుతాడా? మోక్షాన్ని పొందుతాడా? అన్నది ప్రశ్న. నిజంగా పాప కర్మలు మాత్రమే చేస్తూ అంత్య కాలము నందు భగవంతుని స్మరించ నట్లయితే కచ్చితంగా భగవంతుని పొందుతాడు ఇందులో ఎటువంటి అనుమానం లేదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు "అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వాకలేవరమ్ ! యః ప్రయాతి స మద్భావం యాతినాస్త్యత్ర సంశయః " అన్నాడు. దీనికి అర్థం ఎవరైతే అంత్య కాలము నందు నన్ను స్మరిస్తూ ఎవరైతే నా భావనను పొందుతారో వాళ్లు కచ్చితంగా నన్నే చేరుకుంటారు ఇందులో ఎటువంటి అనుమానం లేదు సంశయము లేదు అని కృష్ణుడు స్పష్టంగా వివరించారు. కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి పాప కార్యాలు మాత్రమే చేసినవాడు భగవంతుని యందు భక్తి లేని వాడు ఆఖరి సమయంలో లో భగవంతుని ఎట్టి పరిస్థితుల్లోనూ స్మరణకు తెచ్చుకోలేడు. ఎందువలన అనగా పాప కార్యాలు చేస్తున్న వాడి మనసు ఎప్పటికీ పాప కార్యాలను స్మరిస్తూ ఉంటుంది అంత్య కాలము నందు వాడి మనసు ఇంకా ఎక్కువ ధనం ఆర్జించాలిసింది. ఇంకా సుఖభోగాలు అనుభవించాల్సింది. ఇంకా అక్రమాలు చేసి ఆస్తులు సంపాదించినట్లయితే మా భార్య బిడ్డలు ఇంకా సుఖంగా బతికే వాళ్లేమో అని ఇలాంటి రకరకాల ఆలోచనలతో ఉంటూ వీటిని స్మరిస్తూ దేహాన్ని విడుస్తాడు. అంతేగాని భగవంతున్ని కచ్చితంగా స్మరించడు. ఒకవేళ స్మరించినట్లయితే కచ్చితంగా భగవంతుని పొందుతాడు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంత తేలికగా అంత్యకాల మందు భగవంతుడు స్మరణకు వచ్చినట్లయితే ఈ శాస్త్రాలు ఉపనిషత్తులు వేదాలు పురాణాలు ఆత్మ బోధ ధర్మ సూత్రాలు బ్రహ్మ సూత్రాలు ఇవన్నీ వచ్చేవి కావు మహర్షులందరూ ఈ గ్రంథాలను రచించే అవసరము ఉండేది కాదు. అంత్య కాలము నందు భగవంతుడు స్మరణకు రావాలంటే భగవంతుడిని భక్తి భావనతో కొలుస్తూ తన అంతః కరణాలను అనగా మనసు చిత్తము బుద్ధి అహంకారము లను శుద్ధి చేసుకుని గురువు ద్వారా ఉపనిషత్తులోని సారాన్ని భగవద్గీతను బ్రహ్మసూత్రాలను ఆధ్యాత్మిక ప్రకరణ గ్రంధాలను గురించి సమగ్రంగా తెలుసుకుని జ్ఞానాన్ని పొంది వైరాగ్యం పొంది ఆత్మ విచారణ చేసి భగవంతుడు తప్ప ఏమీ లేదు అని అద్వైత భావంతో మోక్షం తప్ప ఇంకేమీ అవసరం లేదు అన్న తలంపుతో నిత్యము భగవంతుని స్పరిస్తూ ఉంటే కచ్చితంగా అంత్య కాలము నందు భగవంతుడు తప్పక స్మరణకు వస్తాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు