సూక్ష్మశరీరం, స్థూల శరీరం అనుభవించే కర్మలు ఏమిటి?

సూక్ష్మశరీరం, స్థూల శరీరం అనుభవించే కర్మలు ఏమిటి?

========================================
సహజంగా ఆధ్యాత్మిక భావన కలిగిన చాలామందికి సూక్ష్మశరీరం , స్థూల శరీరం అనుభవించే కర్మలు ఏమిటి అంటే శరీరంతో ఉన్నప్పుడు అనుభవించే కర్మ ఫలితాలు ఏమిటి శరీరం లేనప్పుడు అనుభవించే కర్మ ఫలితాలు ఏమిటి అవి అనుమానం కలుగుతుంది.
కర్మ సిద్ధాంతం ప్రకారం మానవునికి మూడు శరీరాలు ఉంటాయి మొదటి కారణ శరీరము రెండవది సూక్ష్మ శరీరము మూడవది స్థూల శరీరము. ఒక జన్మలో మనిషి చేసిన సంచిత కర్మలు మరియు వాసనలు కారణ శరీరానికి అంటిపెట్టుకొని ఉంటాయి దేహాన్ని విడిచిన తర్వాత ఏ కర్మలు అయితే అనగా సంచిత కర్మ లో పుణ్య కర్మలు గానే లేదా పాపకర్మల గాని ఏదైతే పక్వానికి వస్తాయో, పితృలోకంలో సూక్ష్మశరీరం ఆ పుణ్య ఫలితాన్ని గాని లేదా పాప ఫలితాన్ని గాని అనుభవిస్తుంది. పుణ్య కర్మలు పక్వానికి నచ్చినట్లయితే సుఖభోగాలను పాపకర్మలు పక్వానికి వచ్చినట్లయితే నరకయాతన అనుభవిస్తాడు. ఇప్పుడు కర్మలతో పాటు వాసనలు కూడా పక్వానికి వచ్చినట్లయితే అనగా కర్మలు వాసనలు రెండూ కలిపి పక్వానికి వచ్చినట్లయితే పక్వానికి వచ్చిన కర్మ వాసనలు తగినట్లుగా అనుభవించడానికి తగిన దేహాన్ని పొందుతాడు. అనగా పాపకర్మలు ఎక్కువగా ఉండి, పుణ్యకార్యములు తక్కువగా ఉన్నట్లయితే, జంతువులు గా గాని మృగాలుగా గాని లేదా పశుపక్ష్యాదుల గా గాని జన్మిస్తాడు. పుణ్య కర్మలు పాప కర్మలు సమానంగా ఉన్నట్లయితే మనిషి దేహాన్ని ధరిస్తాడు. ఆ తర్వాత ఆ దేహం ద్వారా పాప పుణ్య ఫలితాలను అనుభవిస్తాడు.