ముందు మాట

 నా పేరు శ్రీ రామ గోపాల్ కాచిభొట్ల. నేను ఆంద్రా విశ్వవిద్యాలయంలో multimedia & internet technology లో pg మరియు hotel manegment course చేసాను. multimedia రంగంలో ఉంటూ అధ్యాత్మికంగా అడుగులు వేయడం ప్రారంబింసాను. 14 సంవత్సరాల క్రితం కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆధ్యాత్మికంగా కొన్ని అనుమానాలు నాకు కలిగాయి. ప్రతి మనిషికి తన జీవితంలో ఏదో ఒక రోజు ఇటువంటి అనుమానాలు కలుగుతాయి. వాటిని నివృత్తి చేసుకునే మార్గం తెలియక ఎవరు జవాబు చెబుతారో తెలియక ఆ అనుమానాలను అనుమానాలు గానే ఉండిపోతాయి . నేను నా అనుమానాలకు నివృత్తి చేసుకోవడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేశాను. ప్రతి మనిషికి కలిగే ప్రశ్నలకు సమాధానాలు పూర్వకాలంలో ఉన్న మనుషులకు మాత్రమే తెలుసు . అంటే మహర్షులకు మాత్రమే తెలుసు అంటే వేదవ్యాసులు ఆదిశంకరాచార్యులు వారికి మాత్రమే తెలుసు. కానీ దేహాన్ని విడిచి పెట్టిన వారు రాసిన గ్రంథాలు మనకు అందుబాటులోనే ఉన్నాయి. అదే మన గొప్ప దైవ అనుగ్రహం. అవే మన వేదాలు ఉపనిషత్తులు వాంగ్మయాలు. ఇప్పటికీ వీటన్నిటిని అవపాసన పట్టిన మహానుభావులు ఎందరో ఉన్నారు. నేను వేదంలోని సారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాను. 10 ఉపనిషత్తులు చదివాను. భగవద్గీతను చదివాను. ఆదిశంకరాచార్యులు రచించిన కర్మసిద్ధాంతం ఆత్మబోధ తత్వ బోధ మొదలగు గ్రంథాలను చదివాను. రమణమహర్షులువారు ఉపదేశించిన ఉపదేశ సారం గ్రంధాన్ని చదివాను. నా గురుదేవులు స్వామి పరిపూర్ణానంద, పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారు, చలపతి రావు గారు వంటి మహానుభావుల ప్రసంగాలను విన్నాను. నాకు కలిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. నాకు ఇప్పుడు ఒక విషయం మాత్రం అర్థమైంది. ఇప్పటి వాళ్ళు లౌకిక జ్ఞానాన్ని అద్భుతంగా అర్థం చేసుకుంటున్నారు అంటే సైన్సుకు సంబంధించిన విషయాలను విజ్ఞానాన్ని సులభంగా అద్భుతంగా అర్థం చేసుకుంటున్నారు కొత్త కొత్త విషయాలను కనిపెడుతున్నారు. టెక్నాలజీ విషయంలో ఎంతో ముందంజలో ఉన్నారు. కానీ ఈ గ్రంథాలను అంటే వేదాలను ఉపనిషత్తులను కనీసం భగవద్గీతలో ఉన్న సారాన్ని కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. తాను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయడంలేదు. కుప్పగా పడి ఉన్న వేదాలను మానవుడు చదవ లేడని గ్రహించలేడు అని వేదాలను నాలుగుగా విభజించారు. అయినా మనిషి చదవలేక పోతున్నాడు గ్రహించలేక పోతున్నాడు అర్థం చేసుకోలేక పోతున్నాడు. జ్ఞానాన్ని పొందలేకపోతున్నాడు . కలియుగంలో ఆదిశంకరాచార్యుల వారు ఈ విషయాన్ని గ్రహించి ఆత్మబోధ, తత్వబోధ ,వివేక చూడామణి వంటి చాలా గ్రంథాలను మనిషికి సులభంగా జ్ఞానాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. అయినా మనిషి జ్ఞానాన్ని పొందలేకపోతున్నాడు . నాకు కలిగిన జ్ఞానం నాకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని పొంది మోక్షసాధకులు గా మారాలని ఆధ్యాత్మికంగా నాకు కలిగిన ప్రశ్నలు ప్రతి ఒక్కరికి తమ జీవితంలో కలిగి ఉంటాయనే ఉద్దేశంతో శాస్త్ర ఆధారంతో వాటికి సమాధానాలు సులభంగా వివరించే ప్రయత్నం చేశాను . అందరికీ సులభంగా ఆత్మజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ website ను నిర్మించాను ఈ ప్రయత్నాన్ని మీరు విజయవంతం చేస్తారని ఆశిస్తూన్నాను. ●●●●