సృష్టి ఎలా ఆవిర్భవించింది.



        సృష్టి ఎలా ఆవిర్భవించింది? 

        ***********************

 ఆధ్యాత్మికంగా ఉండే మనిషిలో కలిగే అనుమానాలు సాధారణంగా జీవించే మనిషిలో కూడా కలిగే అనుమానం సృష్టి ఎలా ఆవిర్భవించింది? మొదటగా మనం అనుకోవలసింది సృష్టి వేరు, సృష్టికర్త వేరు కాదు.ఇది కొంచం ఆశర్యం కలిగించే మాట. కాని ఇది నిజం. సృష్టి అంటే యిదివరలో లేనిది, ఇప్పుడు కల్పించబడి కన్పించేదని స్థూలంగా అనుకోవచ్చు. మన వేదాలు,ఉపనిషత్తులు, ఇదే చెబుతున్నాయి.ఇప్పటి సైన్స్ కూడా "బిగ్ బ్యాంగ్" థియరీ ద్వారా ఇదే విషయాన్ని నిరూపణ చేసింది.సైన్స్ అంటే ఏమిటి జరిగినదానిని వెలుగులోకి తీసుకొని వచ్చి ప్రపంచానికి బహిర్గతం చేయడం.వాస్తవికతను తెలియజేయడం. వేదాలలో ఏమి ఉందొ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి అదే విషయాన్ని తెలిపారు. ఇప్పుడు మనం వేదాలలో ఏమి వ్రాయబడి ఉందొ తెలుసుకుందాం.వేదం అంటే 'శృతులు' అంటే వినునవి. మన ఋషులు తమ ధ్యానంలో ఉండి విశ్వములో నుండి వచ్చిన మంత్రాలను విన్నారు. అంటే ఈశ్వరుని నుండి వచ్చిన మంత్రాలను విన్నారు.అవే మన వేదాలు. ఋగ్వేదంలో పదవ మండలంలో 128,129 సూక్తులు సృష్టి గురించి వివరిస్తున్నాయి. ఋగ్వేదం ఋక్కుల రూపంలో ఉంటుంది. ఈ సూక్తులు ఏమని వివరిస్తున్నాయి అంటే సృష్టికి ముందు అక్కడ 'సత్తు' లేదు. సత్తు అంటే ఉండటం. 'ఉండటం' అనేది లేదు. 'అసత్తు' కూడా లేదు. అసత్తు అంటే 'ఉండకపోవడం'. ఉండకపోవడం కూడా లేదు. ఆకాశము లేదు భూమి లేదు.పగలు లేదు రాత్రి లేదు. మృత్యువు లేదు అమృతము లేదు. అక్కడ గంభీరంగా ఎదో ఆవరించి ఉంది.వాయువు లేని చోట ఎదో శ్వాసిస్తూ ఉంది. సైన్స్ కూడా ఇదే చెబుతుంది . ఐన్ స్టీన్(einstein) సిద్దాంతం ప్రకారం '0' టైం '0' స్పేస్ ఉండవచ్చు అని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇదే విషయం కోట్ల సంవత్సరాల క్రితం టెక్నాలజీ లేని కాలంలో ఋషులు ఎలా తెలుసుకున్నారు? ఎలా సాధ్యపడింది? ఋగ్వేదం సృష్టికి ముందు విషయాన్ని వివరిస్తే ఉపనిషత్తులు సృష్టి ఆవిర్భావాని వివరించాయి. మొదటగా అవ్యక్తంగా ఉన్న ఒక చిన్న ముద్దగా ఉన్న బ్రహ్మణువు(బ్రహ్మాండము) వ్యక్తం అయి, మాయ (మాయదేవి)అవహించడం వలన మహత్తు ఏర్పడింది. తరువాత ఆ బ్రహాండం విస్ఫోటనం చెంది విస్తరించడం మొదలుపెట్టింది. తరువాత మాయ నుండి సత్వ, రజో,తమో గుణాలు ఏర్పడ్డాయి. తర్వాత సూక్ష్మ సన్మాత్రలు ఏర్పడి,  వాటి నుండి సూక్ష్మ పంచభూతాలు ఏర్పడి, అవి ఒకదానితో ఒకటి 'పంచికరణం' చెందాయి. తరువాత ఇరవై తత్వాలు పుట్టాయి. అవి 1. పంచభూతాలు (ఆకాశం,గాలి,నీరు,నిప్పు,పృద్వి)2.పంచ సన్మాత్రలు (శబ్ద,గంధ,రస,రూప,స్పర్శ) 3.పంచ కర్మేద్రియలు, 4.పంచ జ్ఞానేంద్రియలు పుట్టాయి. ప్రాథమిక కణాల(elementary particles) వలన శబ్దం ఏర్పడి ఆకాశము దాని నుండి వాయువు దాని నుండి అగ్ని దాని నుండి నీరు దాని నుండి పృద్వి పుట్టింది.ఈ బ్రహ్మాండము విస్తరిస్తూ ఎన్నో నక్షత్ర మండలాలు గ్రహాలు ఏర్పడ్డాయి.ఆ తరువాత తిర్యక్‌ సర్గం. అంటే వృక్షాదులు, జంతుజాలములు, పక్షులు మొదలైనవి. ఆ తర్వాత అర్వాక్‌ సృష్టి. అంటే మనుష్య సృష్టి.ఇలా విస్తరిస్తూ తరువాత ముకులించి(involution} పోతుంది. ఇది అనంతంగా జరుగుతూనే ఉంటుంది. సృష్టి, కాలానికి సంబంధించి మన పురాణాలలో వివరణ ఉంది. ఆది ఏమిటంటే సృష్టి చేసే బ్రహ్మకు అయిస్టు వంద సంవత్సరాలు. అంటే సత్య,త్రేతా,ద్వాపర,కలి యుగాల ను కలిపి ఒక మహాయుగం అంటారు.71 మహాయుగాలు ఒక మన్వంతరం. 14 మన్వంతరాలు ఒక కల్పం. ఒక కల్పం బ్రహ్మ గారికి ఒక పగలు ఇంకో కల్పం ఒక రాత్రితో సమానం. రెండు కల్పాలు బ్రహ్మకి ఒక రోజు.పగలు సృష్టి చేసి రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. దీనినే విస్తరణమరియు ముకుళింపు అంటారు. బ్రహ్మాండము నుండి వచ్చిన సృష్టి బ్రహ్మాండములొనే లీలమవుతుంది. బ్రహ్మ యొక్క వంద సంవత్సరాలు విష్ణుకి ఒక రోజు. విష్ణువు యొక్క వంద సంవత్సరాలు రుద్రునికి ఒక రోజు రుద్రుని వంద సంవత్సరాలు అమ్మవారికి కనురెప్పపాటు.ఈ విధంగా పురాణాలు కాలాన్ని వివరించాయి. ఇప్పుడు బ్రహ్మ వయస్సు 52 సంవత్సరాలు. మనం 28వ చతుర్యుగం 7వ మన్వతరం అయిన వైవస్వత మన్వంతరములో ఉన్నాము. ఎడ్విన్ హుబల్(Edwin Hubble)అనే శాస్త్రవేత్త 1929లో 100 అంగుళాల స్పేస్ టెలిస్కోప్ ద్వారా మన గాలెక్సి ని పరిశీలించగా కోట్ల నక్షత్ర గుంపులు కదిలిపోవడం గమనించాడు. ఇందు మూలంగా తెలిసింది ఏమిటంటే ఈ విశ్వం విస్తరిస్తోంది అని తెలిసింది.సైన్సు కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది.2001లో నాసా ప్రయోగాల ద్వారా ఈ విశ్వం విస్తరిస్తూ తరవాత ముకుళింపు అవుతుంది ఇది అనంతంగా జరుగుతూనే ఉంటుంది అని తెలియజేసింది. కోట్ల సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని ఉపనిషత్తులు తెలిపాయి.ఒక కల్పకాలం పాటు విశ్వం ఏర్పడి విస్తరిస్తూ ఒక కల్పకాలం పాటు ముకుళింపుకొని 'సబ్దు'గా ఉంటుంది. ఒక పదార్దాన్ని సృష్టించలేము నాశనం చేయలేము ఇది ఒక రూపం నుండి వేరొక రూపానికి రూపాంతరం చెందుతుంది. ఈ వేదాలు ఉపనిషత్తులు మన విశ్వం వరకూ వివరిస్తాయి.  మన విశ్వాన్ని దాటిన తర్వాత అనేక విశ్వాలు


ఉన్నాయి మన కంటే అడ్వాన్స్ టెక్నాలజీ చెందిన శక్తివంతమయిన జీవులు ఉంటాయి.వాటిని మనము అసలు ఊహించలేము. వాళ్ళు మన విశ్వం కంటే కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటారు. వాళ్ళని మనం గ్రహంతవాసులు(ఎలియన్స్) అని అంటుఉంటాము. మన పురాణాల్లో గంధర్వులు,కిన్నెరలు,యక్షులు అని వివిధ రకాల పేరులతో ఉంటాయి. మన గ్రంధాలలో ఉన్న విషయాలను ఇప్పటి సైన్సు ఒప్పుకుంటుంది.మన భారతదేశంలో లేనిది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు