అద్వైత తత్వము

శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటే శివకేశవ భేదం లేదు.శివుడు ,నారాయణుడు ఇద్దరూ వేరు కాదు.ఇద్దరూ ఒక్కటే.కార్తీక మాసంలో భక్తులు ఈశ్వరుని,నారాయుడిని ఇద్దరినీ పూజిస్తారు.ఇద్దరు ఒక్కటి అయితే, శివ తత్త్వం వేరు విష్ణు తత్త్వం వేరుగా ఉందేమిటి? అని చాల మందికి అనుమానం. నామరూపాలలో తేడా ఉంది తత్వాలలో తేడా ఉంది.నారాయణుడు స్థితి కారకుడు ఈశ్వరుడు లయ కారకుడు నారాయణుడు అలంకార ప్రియుడు ఈశ్వరుడు అభిషేక ప్రియుడు.ఇలా చెప్పుకుంటూపోతే చాలా తేడాలు కనిపిస్తాయి. ఇవి అన్ని అందరికీ తెలిసిన విషయమే.ఈ కారణాల వలన వేరుగా భావించి ఈశ్వరుడు గొప్ప , నారాయణుడు గొప్ప అని వాదించుకుంటున్నారు. ఈ వాదనలు పూర్వకాలం నుండి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. బ్రహ్మ నారాయుని నాభి నుండి జన్మిమించారు.అంటే నారాయణుడు నారాయణీ అయ్యాడు. శివ, శివాని భార్యాభర్తలు. రుద్రా, రుద్రాణి భార్యాభర్తలు.నారాయణ, నారాయణి అన్న చెలెళ్ళు.

అంటే నారాయణుడు నారాయణీ అయ్యాడు.నారాయణి అంటే పార్వతి దేవి.ఇప్పుడు బ్రహ్మ నారాయునిలో ఐక్యమవుతే, నారాయణి శివునిలో ఐక్యమవుతుంది.ఇప్పుడు శివ కేశవులకి బేదం ఉందా? లేదు ఇద్దరూ ఒక్కటే. బ్రహ్మ్మము ఒకటే, పరబ్రహ్మ్మము ఒకటే. శివునికి స్థాణువు అని మరొక నామము ఉంది. స్థాణువు అంటే కదలని వాడు అని అర్థము. కదలనివాడు అంటే అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉంటె కదలడానికి చోటెక్కడిది? అందుకే అంతా వ్యాపించి ఉన్నది బ్రహ్మo మాత్రమే. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల విషయానికి వస్తే , ఆయన విష్ణుభక్తుడు కానీ శివస్వరూపము అంటారు అది ఎలా జరుగుతుంది? సాక్షాత్తు శివుడే ఆదిశంకరాచార్యులు రూపంలో వచ్చాడు అంటారు. ఆదిశంకరాచార్యులు శివుడే అనడానికి వేదాల్లో ఉపనిషత్తుల్లో గాని సాక్షాలు ఏమైనా ఉన్నాయా అని కొంతమంది వేసే ప్రశ్న. కలియుగంలో మానవులు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి దానికి సాక్ష్యం కావాలి. మానవుడికి కంటికి కనిపించేది వాస్తవం. వేదాలలో ఉపనిషత్తులలో ఆదిశంకరాచార్యులు గురించి కొద్దిపాటి సూచన ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే రుద్రం చదివినట్లయితే అందులో నమః కపర్ధినే చ వ్యు'ప్తకేశాయ చ. కపర్దినే అంటే జటాజూటము తో ఉన్న శివుడు వ్యు'ప్తకేశాయ అంటే బోడి గుండు తో ఉన్న శివునకు నమస్కారము అని అర్థము. జటాజూటము తో ఉన్న శివుని మనము చాలా దేవాలయాలలో చూసి ఉంటాము. మరి బోడిగుండు తో ఉన్న శివుడు ఎక్కడైనా ఏ దేవాలయం లో నైనా ఉంటాడా? మరి దీని అర్థం, శివుడు ఆదిశంకరాచార్యులుగా వచ్చాడు అని అర్థం. దీని వల్ల మనకు తెలిసింది ఏమిటంటే ఆదిశంకరాచార్యులు శివ స్వరూపులు అని అర్థం. వేదంలో ఈ విషయం స్పష్టంగా తెలుపబడి ఉంది. ఇప్పుడు షిరిడీ సాయిబాబా విషయానికొస్తే ఆయన విషయంలో కూడా వాదనలు జరుగుతున్నాయి. కులమత బేధాలు లేకుండా ఆయననే పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన దేవుడు కాదు అని భావించే వాళ్లు కూడా ఉన్నారు వేదజ్ఞానం తెలిసిన వాళ్లేకాదు,పీఠాధిపతులు కూడా ఆయన దేవుడు కాదు పూజించకూడదు అని వాదిస్తున్నారు. ఈ వాదన ఎందుకు వచ్చిందంటే షిరిడి సాయి బాబా గారు మాంసాన్ని భుజించేవారుట సంధ్యావందనం చేసేవారు కాదుట నేను ముస్లిం అని చెప్పుకున్నారట. ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన శ్రీ సాయి లీలామృతం అనే పుస్తకాన్ని చదివితే సాయి బాబా గురించి చాలా చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. భరద్వాజ గారు రాసిన ఈ పుస్తకం ఎంత మంది భక్తుల ఆదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే. ఎక్కిరాల భరద్వాజ గారు తత్వమసి గా ఉండేవారు తత్వమసి అంటే తమకు ఉన్న జ్ఞానం బ్రహ్మ అని, ఏక మేవ అద్వితీయం’, ఉన్నది ఒక్కటే!  భావించడం దీనిని తత్వమసి బ్రహ్మ అని అంటారు.ఈ తత్వమసి బ్రహ్మ అనేది వేదాలలో నాలుగు మహా వాక్యాలలో ఒక మహావాక్యము. వేదాలలో నాలుగు మహావాక్యాలు ఉన్నాయి అవి మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ రెండవది అహం బ్రహ్మాస్మి మూడవది తత్వమసి బ్రహ్మ నాలుగవది అయమాత్మాబ్రహ్మ. సాయిబాబా గారు ఆయన ఒక చోట ముస్లిం అని చెప్పారు మరొకచోట నేను సద్బ్రాహ్మణుడుని అని చెప్పారు. నేను ముస్లిం అని చెప్పినప్పుడు వచ్చిన వాదన నేను బ్రాహ్మణుడిని అని చెప్పినప్పుడు ఈ వాదన ఎందుకు రాలేదు? దేవుడు అంటే ఎవరు సర్వ వ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన వాడు. ఇలా అనుకుంటే సాయిబాబా గారు ఇవన్నీ నిరూపించి చూపించారు ఆయన హిందువులను ముస్లింలను సమన్వయం చేశారు ఆయన ముస్లిం భక్తుల గురించి మాంసాన్ని భుజించారు. వారికి మాంసం అయినా, రాయి అయిన, మట్టి అయినా ఒకటే అంతా బ్రహ్మమే. అలాగే చాలామంది మహాత్ములు అవధూతలు వున్నారు.అందులో నాంపల్లి బాబా గారు ఒకరు. భగవాన్ రమణ మహర్షి, సదాశివ సిద్దేశ్వర సరస్వతి గారు మాస్టర్ సి.వి.వి గారు ఇలా చాలామంది ఉన్నారు. ఈ దేహము ఈ ప్రపంచం అంతా అశాశ్వతము అని అద్వైత భావనతో బ్రహ్మంతో ఎల్లప్పుడు రమిస్తూ ఉంటారు. దత్తాత్రేయ ఉపనిషత్తు, ఆదిశంకరాచార్యులు రచించిన 'వివేక చూడామణి' లో అవధూతలు గురించి వివరణ ఉంది. మన సనాతన ధర్మంకు ముప్పు వాటిల్లినప్పుడు అవదూతలు, బాబాలు మనకు జ్ఞానబోధ చేయడానికి వస్తారు. మనము వారి మార్గాన్ని అనుచరించే ప్రయత్నం చేసి ఆత్మ జ్ఞానాన్ని పొంది మోక్షసాధకులాగా మారాలి. ఆత్మ జ్ఞానము వలన మాత్రమే ఈ అద్వైత తత్త్వం ఆర్డమవుతుంది.