జీవుడు ఎలా వచ్చాడు అనే ప్రశ్న చాలామంది మదిలో మెలిగే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఉపనిషత్తులు వేదాలు తెలిపాయి. కానీ అసలు సమస్య ఏమిటంటే ఉపనిషత్తులలో గాని పురాణాలలో గాని ఈ జీవుడు ఎలా వచ్చాడు అంటే పరమాత్మ నుండి ఈ జీవుడు జారిపడ్డాడు అని తెలుపుతాయి. కానీ పరమాత్మ నుండి జీవుడు ఎలా జారి పడ్డాడో ఉపనిషత్తులు పురాణాలు వివరించే తీరు చాలా గజీబిజీగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉండేవాళ్లకు అర్థం అవుతుంది గాని మామూలు వాళ్లకు అర్థం కావడం చాలా కష్టం. అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఈ ప్రశ్నకు సూటిగా గజిబిజి లేకుండా చెప్పాలి అంటే ఒక మనిషికి ఒక తండ్రి ఆ తండ్రికి ఒక తండ్రి మరల ఆ
తండ్రికి ఒక తండ్రి అలాగే తండ్రికి నలుగురు కొడుకులు ఆ నలుగురు కొడుకులకు ఇంకొక నలుగురు కొడుకులు ఈ నలుగురు కొడుకులు కి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే మొట్టమొదటి తండ్రి ఎవరు అని ఒక అనుమానం. అలాగే ఈ సృష్టి ఎలా పుట్టింది? అంటే పూర్వసృష్టి వాసనలు. ఈ వాసన ఎలా వచ్చింది అంతకుముందు పూర్వ వాసన. అసలు ఈ వాసనలు ఎలా వచ్చాయి అన్నది ఒక అనుమానం. ఇప్పుడు అసలు విషయానికి కి వద్దాము. మనకి మూడు అవస్థలు ఉంటాయి. అవి జాగృత, స్వప్న, సుషుప్తి. రాత్రి మనం నిద్రపోయే ముందు ఉండే అవస్థను జాగృతవస్థ. ఆ తర్వాత నిద్రలోకి వెళ్ళినప్పుడు మన మనసు ఒక స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకుoటుంది. ఆ స్వప్నంలో ఒక ప్రకృతి ఉన్నట్లుగా, పట్టణాలు, చెట్లు, జంతువులు పక్షులు ఉన్నట్లుగా, ఆ స్వప్నం లోనే మనం ఉన్నట్లుగా,మనసు, బుద్ధి ఉన్నట్లుగా ఉంటుంది. ఆ స్వప్నం లోనే అనేక సంఘటనలు జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా మనల్ని ఇది కల ఇదంతా అబద్ధం అని చెబితే మనం నమ్మము. పైగా నేను నవ్వుతున్నాను గా, దుఃఖిస్తున్నానుగా, ఇదంతా నిజమే గా అని అంటాము. అవును కదా! ఈ స్వప్నం నుండి జాగృత లోకి వచ్చిన తర్వాత మనకొచ్చిన స్వప్నం గురించి ఎవరైనా అడిగితే, అదంతా భ్రమ అదంతా ఒట్టిదే మాయ భ్రమ బ్రాంతి అని అంటాము. అలాగే ఈ జాగృత నుండి జ్ఞానవస్థ లోకి వెళ్ళినట్లయితే, ఈ జాగృత ప్రపంచం అంతా మాయ భ్రమ భ్రాంతి అనిపిస్తుంది. జాగృతలో స్వప్నం ఎలా అబద్ధమో, జ్ఞానవస్థలో జాగృత ప్రపంచం అబద్దం. నిజం చెప్పాలంటే స్వప్న ప్రపంచం ఈ జాగృతి ప్రపంచం రెండు అబద్ధాలే. అంటే ఈ ప్రపంచము లేదు, ప్రకృతి లేదు, విశ్వమూ లేదు, అసలు జీవులు లేరు. స్వప్న ప్రపంచం అనేది మన మనస్సు యొక్క సృష్టి. అంటే మన మనసు కన్న కల. జాగృతి ప్రపంచం పరమాత్మ యొక్క సృష్టి. అంటే పరమాత్మ కన్న కల. మన మనసు కన్న కల 'ప్రాతిపాదిక కర్త' పరమాత్మ కన్న కల 'వ్యవహారక కర్త' అందుకే ఆది శంకరాచార్యులవారు ఇదంతా మాయ. ఈ మాయ చేసిన కల్పనలు మాత్రమే. దీనిని మాయా కల్పము అంటారు అని చెప్పారు. ఆయన మాయ గురించి చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు.అది ఏమిటంటే,
య౼మ౼క౼మాయ. య అంటే ఏదైతే, మ అంటే లేదో, క అంటే అది. వివరంగా చెప్పాలంటే ఏదైతే లేదో అది మాయ అని అర్థం.
0 కామెంట్‌లు