పాప ఫలితాన్ని నరకం లోకంలో మరియు భూమిమీద రెండు చోట్ల అనుభవించాలా?
===============≠========================
అసలు ప్రశ్న ఏమిటంటే జీవుడు దేహాన్ని విడిచి పెట్టిన తర్వాత నరక లోకం లో పాప ఫలితాన్ని ఆనుభవించిన తర్వాత దేహాన్ని ధరించి భూలోకానికి వచ్చిన తర్వాత మరలా పాప ఫలితాన్ని అనుభవించాలా అని ప్రశ్న. మొత్తం పాప ఫలితాన్ని ఒకేసారి
అనుభవిస్తే సరిపోతుంది కదా! మరలా భూలోకంలో ఈ పాప ఫలితాన్ని అనుభవించడం ఎందుకు అని ఒక ప్రశ్న. సహజంగా జీవుడు దేహాన్ని విడిచిన తర్వాత తనతో పాటు సంచిత కర్మలు జీవుడు వెంట ప్రయాణం చేస్తాయి. జీవుడు పితృ లోకానికి చేరిన తర్వాత సంచిత కర్మలు లో ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో వాటిని అక్కడ నరకయాతనలుగా అనుభవించాలి. ఏ పుణ్యకర్మలు అయితే పక్వానికి వస్తాయో అప్పుడు పుణ్య ఫలితాన్ని అనుభవించాలి. అంటే సుఖ భోగాలను అనుభవించాలి. విపులంగా చెప్పాలంటే సంచిత కర్మలు లో ఏ కర్మలు అనగా పాపకర్మలు గాని పుణ్యకర్మల గాని ఏదో ఒకటి పక్వానికి వచ్చినట్లయితే వాటి ఫలితాలు అనగా పాప ఫలితాన్ని గాని, పుణ్య ఫలితం గాని, నరక యాతన లేదా సుఖ భాగాలుగా అక్కడ అనుభవిస్తారు. అదే సంచిత కర్మలుతో పాటు వాసనలు కూడా పక్వానికి వచ్చినట్లైతే దేహాన్ని ధరించి అనగా కర్మ , వాసనలు రెండూ అనుభవించడానికి సరిపడు దేహాన్ని ధరించి పాప పుణ్య ఫలితాలు అనుభవిస్తారు. దేహాన్ని ధరించి కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు అనగా పాప ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు పూర్వజన్మల పుణ్య కర్మల ఫలితం 'ప్రారబ్దము' గా మారి అది వచ్చినప్పుడు. అనుభవించవలసిన పాపకర్మల యొక్క ఫలితం పక్కకి తొలగి సంచిత కర్మలుగా మారుతాయి. అంతేకాకుండా దేహంతో జీవుడు చేసిన కర్మలు ఫలితాన్ని అనగా ఆగామి కర్మలు చేసినప్పుడు వాటి ఫలితాన్ని కొంతమేర అప్పుడే అనుభవించవచ్చు. మిగిలిన ఫలితం సంచిత కర్మలు గా మారి అవి జీవుడు దేహం విడిచిన తర్వాత ఆ కర్మలు పక్వానికి వచ్చినట్లయితే, వాటి ఫలితాన్ని అక్కడ పితృలోకంలో అనుభవిస్తాడు. అదేవిధంగా కర్మలతో పాటు వాసనలు కూడా వచ్చినట్లయితే దేహాన్ని ధరించి ఫలితాలను అనుభవిస్తారు. కర్మ సిద్ధాంతాన్ని చదివినట్లయితే సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారబ్ద కర్మలు గురించి పూర్తిగా అర్థమవుతుంది.

0 కామెంట్‌లు