--------------------------------------------------+-------------------
సృష్టిలో ఉన్న సమస్తం భగవంతునికి చెందినవి. అజ్ఞానంతో మనం ఇది నాది అది నాది అని అనుకుంటున్నాము. అంత్యకాలము నందు ఇవి అన్ని వదిలి వెళ్లవలసిందే. 100 గజాలు స్థలం చూసి ఇది నాది అనుకుంటాడు. అతని కాలం తీరిన తర్వాత వేరొకడు వచ్చి ఈ స్థలం నాది అనుకుని కాలం గడుపుతాడు తర్వాత వేరొకరు ఇలా కొన సాగుతూనే ఉంటుంది.
నిజానికి ఇది పరమాత్మ యొక్క సొత్తు. మనం అనుభవించి వదలి పోవడమే. సృష్టిలో ఉన్న నీరు,గాలి, చెట్టు,పర్వతాలు, పుష్పాలు, ఫలాలు
మొదలైనవి అన్ని పరమాత్మ సొంతం. మరి ఈశ్వరునికి సొంతమైన వాటిని తిరిగి పూజలో ఆయనకి సమర్పించడం అనేది ఆద్యాత్మికంగా కలిగే ప్రశ్న. మనకు ఎవరైనా సహాయం చేస్తే వారి పట్ల కృతజ్ఞత తెలుపుతాము. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. కృతజ్ఞత లేని మనిషి అధోగతి పాలవుతాడు అని శాస్త్రం చెబుతుంది. ఈశ్వరుడు మనకు ఎంత సహాయం చేస్తున్నాడు. మనకు అద్భుతమైన జ్ఞానేంద్రియలు ఇచ్చేడు. జ్ఞానేంద్రియాలు లేనట్లయితే మనిషి పరిస్థితి ఏమిటి?జ్ఞానేంద్రియాలు అంటే రస,రూప, స్పర్శ, శబ్ద,గంధాలను వ్యక్తం చేసే ఇంద్రియాలు. అవి కన్ను ,ముక్కు, నోరు,చెవి,చర్మం. కన్ను వలన ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము.ఒకవేళ కంటికి చూసే శక్తిని ఈశ్వరుడు ఉపసంహరించుకుంటే ఊహించుకోవడమే కష్టంగా ఉంటుంది. నాసికం (ముక్కు) వలన ఘ్రాణ శక్తి, చెవి ద్వారా వినే శక్తి నాలుక ద్వారా రుచిని గ్రహించే శక్తిని, చర్మము ద్వారా స్పర్శ శక్తిని ఇచ్చి మనకు ఇంత గొప్ప సహాయం చేసిన ఈశ్వరునికి మనం కృతజ్ఞత తెలియజేయాలి కదా! మరి ఎలా తెలియజేయాలి? ప్రపంచంలో ఉన్నవన్ని ఈశ్వరునివే. ఈశ్వరునిది కానిది మనది అన్నదానిని ఈశ్వరునికి సమర్పించాలి. అదియే మన మనసు. ఈశ్వరుడు మన నుండి కోరేది మన మనసు మాత్రమే. ఇప్పుడు మన కంటికి చూసే శక్తిని ప్రసాదించేడు. కంటితో ప్రకృతిలో ఉన్న అందాలను చూసి ఆనందాన్ని సుఖాన్ని పొందుతున్నాము. దానికి కృతజ్ఞతగా 'దీపం' వెలిగించి భక్తితో పవిత్రమైన మనసుతో కృతజ్ఞత తెలపాలి. దీపాన్ని వెలిగించడంలో ఉన్న అంతరార్థం ఇదే. నాసికంతో వాసనా శక్తిని(ఘ్రాణశక్తి) ప్రసాదించేడు. ఈ నాసికాశక్తి ద్వారా ఎన్నో సువాసనలను అనుభవిస్తున్నాము. ఇది నాసికా సుఖము. దీనికి కృతజ్ఞతగా 'ధూపం' వెలిగిస్తాము. మన నాలుకకు జిహ్వ (రుచి) శక్తిని ప్రసాదించేడు.ఈ జిహ్వశక్తి ద్వారా ఎన్నో రుచులను ఆస్వాదిస్తున్నాము. ఇది జిహ్వసుఖము. దీనికి కృతజ్ఞతగా మధుర పదార్దాలతో నైవేద్యం పెట్టి కృతజ్ఞత తెలుపుతాము. మన చర్మానికి స్పర్శ జ్ఞానాన్ని ప్రసాదించేడు. ఈ స్పర్శ జ్ఞానం వలన చల్లదనాన్ని, వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నాము ఇది ఒక సుఖము. దీనికి కృతజ్ఞతగా చల్లటి గంధాన్ని పూస్తారు. ఈ విధంగా స్పర్శ జ్ఞానానికి కృతజ్ఞతగా గంధం పూస్తారు. ఇక చివరిగా మన చెవులకు వినికిడి శక్తిని ప్రసాదించేడు. ఈ వినికిడి(శ్రవణ) శక్తి ద్వారా అనేక శబ్దాలను వినగలుగుతున్నాము. చెవుల ద్వారా ఈశ్వరుని వైభవాన్ని శ్రవణం చేయ గలుగుతున్నాము. దానికి కృతజ్ఞతగా పుష్పాలు సమర్పిస్తాము. మరి పుష్పాలకు చెవులకు సంబంధం ఏమిటి? బ్రమరాలు(తుమ్మెదలు) ఘ్రంకారం చేస్తూ పుష్పాలపై వ్రాలి మకరందాన్ని జుర్రుకుంటాయి. ఈ తుమ్మెదలు చేసే ఘ్రంకారనాదం పుష్పాల కోసమే. అంటే ఈ ఘ్రంకారనాదం పుష్పాలకు చెందినవి. అంటే శబ్దం పుష్పాలకు సంకేతం. అందుకే శ్రవణ శక్తికి కృతజ్ఞతగా పుష్పాలను సమర్పిస్తారు. పూజా విధానంలో మనం ఈశ్వరునికి సమర్పించే పూజా సామాగ్రిలో ఉన్న అంతరార్థం ఇదే. అంతరార్థం తెలిసి పూజ చేసిన వాళ్ళు ఉన్నారు తెలియకుండా యాంత్రికంగా పూజ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైన మనసు నిండా కృతజ్ఞత భావంతో పరమాత్మకు ధూప,దీప,నైవేద్యాలు సమర్పించాలి.

0 కామెంట్‌లు