సంచిత కర్మలను జ్ఞానంతో దగ్దం చేయవచ్చు అని రుజువు ఏది?

సంచిత కర్మలను జ్ఞానంతో దగ్ధం అవుతాయని రుజువు ఏమిటి? 

*********************************************
  1.  ఆధ్యాత్మికంగా ఉండే వాళ్లలో కలిగే ఒక అనుమానం కర్మలన్నీ జ్ఞానంతో ఎలా దగ్ధం అవుతాయి? దీనికి ఏదైనా ఉపమానం ఉందా రుజువు ఏమిటి? అనే అనుమానం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఇలాంటి అనుమానాలు కలగడం సహజమే. అనుమానాలను నివృత్తి చేసుకోకపోతే తెలుసుకున్న జ్ఞానం మనసులో నిలబడదు. మనసుకు జ్ఞానం కలగకపోతే
    మోక్షానికి అడ్డంకులు ఏర్పడతాయి. మనసుకు బయట ఉన్న ప్రపంచం మీద ఆసక్తి ఎక్కువ. లేచింది మొదలు నిద్రపోయే దాకా మనసు జగత్తు వైపు తిరుగుతూనే ఉంటుంది. పరమాత్మ వైపు తిరగదు. మన మనసు పరమాత్మ వైపు తిరగాలంటే, మనోబుద్ధులకు జ్ఞానం అవసరం. ఈ జ్ఞానాన్ని తెలుసుకునే క్రమంలో అనేక రకాల సందేహాలు కలుగుతాయి. ఈ సందేహాలను కచ్చితంగా నివృత్తి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కర్మ సిద్ధాంతం ప్రకారం మూడు రకాల కర్మలను చేస్తాము. అవి ఆగామి, ప్రారబ్ద, సంచిత కర్మలు. ఇవన్ని జన్మజన్మలకు వెంటాడుతూనే ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జ్ఞానంతో సంచిత కర్మలు ఎలా తొలగిపోతాయి అనగా ఎలా రద్దు చేయబడతాయి? ఉదాహరణకు ఒక వ్యక్తికి అపారమైన ధన సంపద ఉంది. అందమైన భార్య బిడ్డలు ఉన్నారు. అతనికి ఏ లోటు లేదు. ఎప్పటికీ సుఖమే దుఃఖం అనేది లేదు. ఒక రోజు ఆ వ్యక్తి రాత్రి సమయాన విందు భోజనం చేసి నిద్రలోకి జారుకున్నాడు. కొంతసేపటికి నిద్రలో అతనికి ఒక స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో అతడు ఒక కూలివాడు కూలి పని చేస్తుండగా తన సహ కూలి వాడితో మాట మాట పెరిగింది. ఆ మాటల యుద్ధం ఘర్షణ దాకా చేరింది. ఆ ఘర్షణ కాస్త కొట్టుకునే వరకు చేరింది ఆ కొట్లాటలో ఆ వ్యక్తి తన సహ కూలిని గునపంతో పొడిచి చంపివేశాడు. తర్వాత పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని బంధించి న్యాయ స్థానము నందు హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి పన్నెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది. పోలీసులు అతన్ని జైలుకు తీసుకు వెళ్లారు జైల్లో వ్యక్తి శిక్ష అనుభవిస్తూ మూడు సంవత్సరాలు గడిపాడు. తర్వాత జైలుకు కొత్తగా జాలి దయ లేని కరుకు హృదయం కలిగిన జైలరు కొత్తగా వచ్చాడు. అందరి చేత కఠినంగా రాళ్లను కొట్టించ సాగాడు అందరితోపాటు సహ కూలీని చంపిన వ్యక్తి చేత కూడా రాళ్లను కొట్టించసాగాడు. కొంతసేపటికి ఆ వ్యక్తికి అలుపు వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఆ జైలరు కొరడాతో ఆ వ్యక్తి వీపు మీద కొట్టాడు. ఆవ్యక్తి విలవిలలాడి పోయాడు జైలరు ఆ వ్యక్తిని అదేపనిగా కొట్టడం మొదలు పెట్టాడు. ఆ వ్యక్తి బాధ భరించలేక అమ్మో అని గట్టిగా అరిచాడు అంతే ఆ వ్యక్తి స్వప్నం నుండి మేల్కొన్నాడు. వెంటనే ఆ వ్యక్తి భార్య ఏమైంది ఏదైనా పిడకల కన్నారా కాస్త మంచినీళ్లు తాగి భగవంతుని తల్చుకుని పడుకోండి అని అంది. ఆ వ్యక్తి అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు జాగృతవస్థలో ఆ వ్యక్తి పెద్ద కోటీశ్వరుడు స్వప్నావస్థలో అతడు కూలివాడు స్వప్నంలో సహ కూలీని చంపిన కారణంగా 12 సంవత్సరాలు శిక్ష పడింది మూడు సంవత్సరాలు శిక్షా కాలం పూర్తయింది మిగిలిన తొమ్మిది సంవత్సరాలు శిక్షాకాలం ఏమైంది? అంటే మూడు సంవత్సరాలు శిక్ష అనుభవించిన తరువాత స్వప్నం నుండి జాగృతవస్థలోకి మేల్కొన్న కారణం చేత మిగిలిన తొమ్మిది సంవత్సరాల శిక్షాకాలం రద్దు చేయబడింది. ఆ వ్యక్తి తొమ్మిది సంవత్సరాల శిక్షను అనుభవించవలసిన అవసరం లేదు. ఎందుకంటే స్వప్నావస్థ నుండి జాగృతవస్థ లోకి మేల్కొన్న కారణంగా అతనికి శిక్ష రద్దు చేయబడింది అదేవిధంగా జాగృదావస్థలో నుండి జ్ఞానవస్థలో మేల్కొంటే సంచిత కర్మలు అన్ని దగ్ధం అవుతాయి. జ్ఞానవస్థలో మేల్కొనడం వలన సంచిత కర్మలు ఉండవు ప్రారబ్ద కర్మలు ఉండవు ఆగామి కర్మలు ఉండవు కర్మలు ఉండవు వాసనలు ఉండదు జన్మలు ఉండవు, సుఖభోగాలు ఉండవు సుఖదుఃఖాలు ఉండదు జీవుడు దేవుడు అవుతున్నాడు. ఈ విధముగా జ్ఞానం వలన సంచిత కర్మలు దగ్ధం అవుతాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు