భగవంతుని యందు భక్తి మోక్షాన్ని కలిగిస్తుందా?

భగవంతుని యందు భక్తి వలన మోక్షం లభిస్తుందా? 

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼-------------------


 భగవంతుని యందు భక్తిని కలిగి నిత్య కర్మలు చేస్తూ నిషిద్ధ కర్మలు చేయకుండా అన్ని జీవులపట్ల ప్రేమగా ఉంటూ దానధర్మాలు చేసిన ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన, గంగానదిలో మునిగిన యజ్ఞాలు చేసిన మోక్షం ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదు భక్తి వలన భగవంతుని అనుగ్రహం కలుగుతుంది గాని మోక్షం లభించదు చేసిన పుణ్య కర్మల వలన అనగా దానధర్మాలు పూజలు పుణ్యక్షేత్రాలు తిరగటం పుణ్యనదులలో మునగడం జీవుల పట్ల దయా గుణాన్ని కలిగి ఉండటం ఇవన్నీ పుణ్య ఫలితాలు ఇస్తాయి అంతేగాని భగవంతుని పొందలేము. భగవంతుని పొందటం అంటే మోక్షం అని అర్థం. మోక్షం కలగాలి అంటే జ్ఞానం కలగాలి జ్ఞానం అంటే జీవుడు పరమాత్మ స్వరూపం అని తెలియబడాలి. ఆత్మ యొక్క స్వరూపాన్ని ఎరుకలోకి తెచ్చుకోవాలి. కానీ జ్ఞానం కలగాలి అంటే పైన చెప్పిన విధంగా పూజలు, జపాలు, దానధర్మాలు చేస్తూ భగవంతుని యందు భక్తిని కలిగి ఉపనిషత్తులను ఆకళింపు చేసుకుని అంతకరణాలను శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే జ్ఞానమనేది సిద్ధిస్తుంది మన చిత్తం శుద్ధి అయినట్లైతే జ్ఞానం అనేది నిలబడుతుంది. భగవంతుడు యందు భక్తి వలన అంతఃకరణాలు శుద్ధి అవుతాయి అంతఃకరణాలు శుద్ధి అవ్వడం వలన జ్ఞానం నిలబడుతుంది. పాత్ర శుభ్రంగా శుద్ధి గా ఉంటే, పోసిన పాయసం నిలబడుతుంది. అదే పాత్ర శుద్ధిగా లేనట్లయితే పోసిన పాయసం నిలబడదు. పాయసం విరిగిపోతుంది. అదేవిధంగా చిత్తము శుద్ధిగా లేనట్లయితే జ్ఞానం నిలబడదు. ఈ జ్ఞానం కూడా గురువు యొక్క ఆధ్వర్యంలో తెలుసుకోవాలి భక్తి వలన చిత్తము శుద్ధి అవుతుంది తెలుసుకున్న జ్ఞానం నిలబడుతుంది ఆ తర్వాత సాధన ద్వారా మోక్షం వస్తుంది. ఉదాహరణకు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు అతని భక్తికి నారాయణుడు దివినుండి భువికి దిగి వచ్చాడు. అంతటి భక్తి ప్రహ్లాదుడిది. అయినా ప్రహ్లాదుడికి మోక్షం లభించలేదు దానికి కారణం అతనికి భక్తి మాత్రమే ఉంది జ్ఞానం లేదు దేవుడు వేరు జీవుడు వేరు అన్న భావన వలన ప్రహ్లాదుడికి మోక్షం కలగలేదు అందువలన జ్ఞానం వలన మాత్రమే మోక్షం ప్రాప్తిస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు